vidaamuyarchi Telugu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విదాముయార్చి’. మగిజ్ తరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. తమిళం, తెలుగులో ఒకేసారి తెరక్కుతోన్న ఈ మూవీ ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘విదాముయార్చి’ షూరు చేసింది మూవీ టీం. రిలీజ్ కు కొన్ని రోజులే ఉండటంతో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ టీం. కారు చేజింగ్ సీన్ తో ఈ ట్రైలర్ మొదలైంది. ఇందులో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్ తో సాగిన ఈ ట్రైలర్ మూవీపై ఆసక్తిని పెంచుతుంది.
అజిత్ ఇందులో ఏజెంట్ పాత్రలో కనిపించారు. అర్జున్ సర్జా రోల్ ఆసక్తిని కలిగిస్తుంది. త్రిష, అజిత్ లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. మొత్తానికి ‘విదాముయార్చి’ మూవీపై మరింత అంచనాలు పెంచుతుంది. కాగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ సర్జా, రెజినా కసాండ్రాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న రిలీజ్ కు రెడీ అవుతుంది. తెలుగులో పట్టుదల అనే టైటిల్ తో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు సినీవర్గాల నుంచి సమాచారం. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే అజిత్ టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ భారీ సినిమా కోసం జతకట్టాడు. యాక్షన్ త్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇందులోనూ అజిత్ సరసన త్రిష జతకట్టింది.మార్ఖ్ అంటోని ఫేం అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.