Aishwarya Rai: ఆస్కార్‌ మ్యూజియంలో ఐశ్వర్య లెహెంగా – ది అకాడమీ ట్వీట్‌ వైరల్‌

  • Written By:
  • Updated On - December 25, 2024 / 05:11 PM IST

Aishwarya Rai Lehenga in Oscar Museum: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ లెహెంగాను ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ మ్యూజియంలో ప్రదర్శించారు. ఇంతకి ఆ లెహెంగ ప్రత్యకత ఏంటో మీకు తెలుసా? ఓ హిస్టారికల్‌ మూవీలో ఐశ్వర్య ధరించిన ఈ లెహెంగా ఎంతోమందిని ఆకట్టుకుంటుందో. పద్దేనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలోని ఐశ్వర్య రాయ్‌ లెహెంగా తాజాగా ఆస్కార్‌ మ్యూజియంలో చోటుదక్కించుకోవడం విశేషం. ఇంతకి ఆ సినిమా ఎంటంటే.. 2008లో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్‌లు ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘జోధా అక్బర్‌’.

హిస్టారికల్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో జోధా రాణిగా ఐశ్వర్య రాయ్‌ లుక్‌ ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. ఇందులో పెళ్లికి ఆమె ధరించిన వెడ్డింగ్ లెహెంగా మరింత అందం తెచ్చిపెట్టాయి. అయితే ఇందులో రెడ్‌ అండ్‌ ఎల్లో కలర్‌లో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన ఈ లెహెంగా వెండితెరపై ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇప్పుడు అదే లెహెంగా అకాడమీ ఆస్కార్‌ మ్యూజియ్‌లో ఉంచింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ట్విటర్‌లో ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది.

ది అకాడమీ ట్విట్‌ చేస్తూ “సిల్వర్‌ స్క్రీన్ రాణికోసం ఈ లెహెంగా కరెక్ట్‌గా ఫిట్‌ అయ్యంది. 2008 జోధా అక్బర్‌ చిత్రం ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ రెడ్‌ వెడ్డింగ్ లెహెంగా వెండితెరపై కనువిందు చేసింది. శక్తివంతమైన జర్దోజీ ఎంబ్రాయిడరీ, శతాబ్దాల నాటి హస్తకళ. అలాగే అరుదైన రత్నం పొదిగించారు. భారత జాతీయ పక్షి నెమలితో ప్రత్యేకంగా తయారు చేసిన ఆభరణాలు. భారతీయ చరిత్ర తెలియజేసేలా నీతా లుల్లాలు ఈ లెహెంగాను డిజైన్‌ చేశారు” రాసుకొచ్చింది. ఇది తెలిసి ఐశ్వర్య ఫ్యాన్స్‌ అంతా తెగ సంబరపడిపోతున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘డియర్‌ హాలీవుడ్‌.. ఇంతకుమించిన అందాన్ని కనిపెట్టండి చూద్దాం’, ‘ఇకపై ఆ మ్యూజియం మరింత అందంగా కనిపిస్తుంది’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ లెహెంగా డిజైన్‌ చేసిన డైజైనర్స్‌ నీతా లుల్లాను పనితీరుపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.