Site icon Prime9

Aditi Rao Hydari: సిద్దార్థ్‌తో ప్రేమాయణం.. స్పందించిన అదితి రావు

aditi rao

aditi rao

Aditi Rao Hydari: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఓ వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. మెున్నటి వరకు సిద్దార్ద్ అండ్ అదితి డేటింగ్ లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. దానికి తగినట్లుగానే వారిద్దరు కలిసి బయట తిరగడం మరింత బలాన్ని చేకూర్చింది. తాజాగా సిద్దార్థ్ తో లవ్ ఎఫైర్ గురించి అదితి రావు హైదరి స్పందించింది.

ప్రేమ గురించి అదితి ఏమన్నదంటే? (Aditi Rao Hydari)

సినీ రంగంలో హీరో, హీరోయిన్‌ కలిసి కనిపించినా చాలు.. వాళ్ల గురించి ఏవేవో వార్తలు రాసేస్తుంటారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో అదితి రావు హైదరి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన లేదు. ఈ టాలీవుడ్ బ్యూటీ పలు సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను సంపాదించుకుంది. తాజాగా హీరో సిద్దార్థ్‌ సీక్రెట్ లవ్ ఎఫైర్ నడిపిస్తున్నారంటూ జోరుగా టాక్ వినిపించింది. వీళ్లద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి డేటింగ్ చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ విషయంపై అదితి స్పందించింది. తాజాగా ఓ పాటకు వీరిద్దరు కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో కూడా తెగ వైరల్‌ అయింది. ఈ క్రమంలో అదితి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వస్తున్న రూమర్స్ పై తనదైన శైలిలో స్పందించింది. తాను ఇండస్ట్రీలో పనిచేయడం ప్రారంభించినప్పటి నుండి ఇతర విషయాలను పట్టించుకోవడం లేదని తెలిపింది. జనాలు వాళ్లకు నచ్చింది మాట్లాడుకుంటారు. వాళ్లను మనం ఆపలేం. వాళ్లకు ఏది ఆసక్తిగా అనిపిస్తే దాని గురించే వెతుకుతారు అని తెలిపింది. ఎప్పటివరకైతే అద్భుతంగా పనిచేయగలనో.. ఏ దర్శకులతో పనిచేయడాన్ని ప్రేమిస్తానో , ప్రేక్షకులు ఎంతకాలం ఆదరిస్తారో అప్పటివరకు సంతోషంగా ఉంటా అని చెప్పుకొచ్చింది.

ఈ మాటలకు అర్ధం అదేనా..

ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను బట్టి.. అదితి ఎవరి మాటలను పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. ఇక ఈ మాటలు విన్న ప్రేక్షకులకు.. ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు. సిద్దార్ద్‌తో ప్రేమ కన్‌ఫార్మ్ చేసిందా? లేక లైట్ తీసుకుందా? అనేది అర్ధం కాలేదు. కాగా ఇటీవల శర్వానంద్ ఎంగేజ్మెంట్ వేడుకకు కూడా అదితి, సిద్దార్ద్ కలిసి జంటగా వచ్చారు. ముంబై వీధుల్లో కూడా చెట్టపట్టాలు ఏసుకొని తిరుగుతున్న ఈ జంట.. తాజాగా ట్రెండ్ అవుతున్న తుమ్ తుమ్ సాంగ్ కి కలిసి స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్త బాగా వైరల్ అయ్యింది. మహాసముద్రంలో ప్రేమికులుగా నటించిన సిద్దార్ధ్, అదితి రొమాన్స్‌ ను బాగా పండించారు. అదితి బర్త్‌ డే సందర్భంగా విష్ చేసిన సిద్దార్థ్.. నా హృదయ యువరాణికి బర్త్ డే విషెస్ అంటూ పుట్టినరోజును పురస్కరించుకుని అదితితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు.

 

Exit mobile version