Site icon Prime9

Surekha Vani: రెండో పెళ్లి పై నటి సురేఖ వాణి క్లారిటీ

surekha vani prime9news

surekha vani prime9news

Tollywood: తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సురేఖ వాణి. ఈ మధ్యకాలంలో సినిమాలకు సురేఖవాణి దూరంగా ఉంటున్నారు. సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారనేది కారణాలు బయటికి రాలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన కూతురు సుప్రీతాతో కలిసి ఆమె చేసే రచ్చ మన అందరికి తెలిసిన విషయమే. మోడ్రన్ డ్రస్సుల్లో సురేఖవాణి, తన కూతురితో పోటీపడుతూ సోషల్ మీడియాలో చేసే  పోస్ట్లు నా స్టైలే వేరబ్బా అన్నట్టుగా  ఉంటాయి. సోషల్ మీడియాలో సురేఖవాణి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

సురేఖ వాణికి భర్త చనిపోవడంతో, సురేఖ వాణి కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు. సురేఖ రెండో వివాహంపై, ఎప్పుడు ఎదో ఒక ఆమెకు ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. అయితే తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని సురేఖ ఎప్పుడో తేల్చి చెప్పారు. ఈ మధ్య కాలంలో ఓ యూట్యూబ్‌ చానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండో పెళ్లి పై కూడా స్పదించారు. నాకు రెండో పెళ్లి పై ఇంటరెస్ట్ లేదని, కానీ నా కూతురు సుప్రీతా నన్ను మళ్లీ చేసుకోమని చెబుతుంది. ఇప్పుడైతే చేసుకునే ఆలోచన లేదు కానీ, భవిష్యత్తులో పెళ్లి పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మరి మీకు నచ్చిన వారు దొరికారా, వారు ఎక్కడ ఉన్నారు. ఎలా ఉంటారని అని అడగగా, ఇప్పుడు ఎవరు లేరని సమాధానం ఇచ్చింది. కానీ నాకు బాయ్‌ఫ్రెండ్‌ కావాలనిపిస్తుందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. అయితే అతను నన్ను బాగా అర్థం చేసుకునేవాడు కావాలని చెప్పింది. ‘మంచి హైట్‌, పర్సనాలిటి ఉన్న వ్యక్తి చూడటానికి బావుంటే చాలు, అలాంటి అబ్బాయి నాకు బాయ్‌ఫ్రెండ్‌గా కావాలని, లైట్‌గా గడ్డం ఉండాలి. అతనికి ఆస్తి , డబ్బులు బాగా ఉండాలి. ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకోనే వారై ఉండాలి. అలాంటి వాడు నాకు కనిపిస్తే, అతడిని వెంటనే పెళ్లి చేసుకుంటా’ అని ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీని బట్టి చుస్తే సురేఖకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. మరి ఈమె రెండో పెళ్లి చేసుకుంటుందా లేక ఇలాగె ఉంటుందా అనేది ఇంకా వేచి చూడాలి.

Exit mobile version