Actress Subi Suresh : చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో వరుస దుర్ఘటనలు సినీ పరిశ్రమలో చోరు చేసుకుంటున్నాయి. ఈ విషాద ఘటనలతో చిత్రసీమ దుఖ సాగరంలో మునిగిపోతుంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ పేరున్న నటులు ఎందరో పలు కారణాలతో కన్నుమూశారు. ఈ క్రమంలోనే తాజాగా కళాతపస్వి విశ్వనాథ్, ప్రముఖ గాయని వాణీ విశ్వనాథ్, తారకరత్న, ప్రముఖ కమెడియన్ మయిల్ స్వామి ఇలా పలువురు మృత్యువాత పడటం సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. ఈ సంఘటనలు మరవకముందే మలయాళ నటి, టీవీ యాంకర్ సుబీ సురేష్ మరణించడం అందరినీ కలిచి వేస్తుంది.
ప్రస్తుతం ఆమె వయసు 42 ఏళ్లు కాగా.. కొద్ది రోజుల నుంచి కాలేయ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జనవరి 28న సుబీని అలువా లోని రాజగిరి ఆస్పత్రిలో చేర్చగా.. కామెర్లు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆమె ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నందున చికిత్స కష్టంగా ఉందని అంతకుముందు ఆమె సన్నిహితురాలు చెప్పారు. అయితే గత 15 రోజులుగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. కాలేయ దాత కోసం ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని కోస్టార్ రమేష్ పిషారోడి తెలిపారు. చాలా మంది వ్యక్తుల సహాయంతో శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేసినప్పటికీ రక్తపోటు అధికం కావడంతో డాక్టర్లు ఆగిపోయారని, ఇంతలోనే చనిపోయిందని తెలిపారు.
కాగా సుబీ సురేష్ చాలా ఏళ్ల కిందట ఏసియానెట్‌లో ప్రసారమైన ‘సినీ మాల’ అనే కామెడీ ప్రోగ్రామ్ ద్వారా సినీ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మిమిక్రీతో పాటు తనదైన కామెడీతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలోనే ‘కనకసింహాసనం, కార్యస్థానం, హ్యాపీ హస్బెండ్స్, ఎల్సమ్మ ఎన్న ఆంకుట్టి, పచ్చకుతీర తదితర మలయాళ చిత్రాల్లో నటించింది. అలాగే ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’, ‘కుట్టి పట్టాలం’ వంటి షోస్ హోస్టింగ్ తనకు మంచి పేరు తీసుకొచ్చాయి.
ఇక సుభీ సురేష్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ‘కొచ్చిన్ కళా భవన్ ద్వారా కళారంగంలోకి ప్రవేశించిన సుబీ. రియాల్టీ షోస్, కామెడీ ప్రోగ్రామ్స్ ద్వారా మలయాళీల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సుబీ మృతితో ఒక మంచి ఆర్టిస్ట్‌ను కోల్పోయాం’ అని సీఎం పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు ఆమె మృతి సంతాపంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ నివాళులు అర్పిస్తున్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/