Samantha : కుందనపు బొమ్మ “సమంత”.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. “ఏ మాయ చేసావే” సినిమాతో తెలుగు తెరేకు పరిచయమైన సమంత ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకొని కెరీర్ ని సాగిస్తుంది. అయితే సమంత జీవితంలో ఇప్పుడు మరో మరుపురాని ఘట్టం చోటు చేసుకోబోతుందని తెలుస్తుంది. తాజాగా సమంత మీద వీరాభిమానంతో ఓ అభిమాని ఆమెకు ఏకంగా గుడి కట్టాడన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రి గా మారింది.
సాధారణంగా ఇప్పటి వరకు గమనిస్తే తమ అభిమాన నటీనటులకు గుడి కట్టి ఆరాధించడం తమిళనాడులో ఎక్కువగా గమనించవచ్చు. గతంలో ఖుష్బూ సుందర్, నిధి అగర్వాల్, నమిత. నయనతారకు గుడి కట్టించి పలువురు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ఈ ట్రెండ్ మొదలయిందని అనిపిస్తుంది. సమంతపై ఉన్న అభిమానంతో ఆమెకు ఓ అభిమాని గుడి కట్టేశాడు.
గుడి ఎక్కడ ? ఎవరు కట్టిస్తున్నారంటే ?? (Samantha)..
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని. నటిగా సమంతా అంటే అమితమైన ఇష్టం ఉన్న సందీప్.. కేవలం నటి గానే కాకుండా.. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిన్నఆమెకు గుడి కట్టించాలని సంకల్పించాడు. దీంతో తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టెయ్యగా.. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సమంతను తాను నేరుగా చూడలేదని.. కానీ, ఆమెపై అభిమానంతో గుడి కట్టిస్తున్నానని సందీప్ చెప్పడం విశేషం. ఈ నెల 28 వ తేదిన గుడిని ప్రారంభిస్తున్నానని ఆయన చెప్పారు. మరి ఈ విషయం గురించి సమంత ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. అయితే ఈ చిత్రం ఆశించిన మేర ప్రేక్షకులను అలరించడంలో విఫలమైందని చెప్పాలి. అలానే విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషీ’ సినిమాలో చేస్తుంది సామ్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అదే విధంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో తనకి పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసిన రాజ్ డికె దర్శకత్వంలో “సిటాడెల్” ఇండియన్ వెర్షన్ లో నటిస్తుంది.
ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో రిచర్డ్ మ్యాడన్ లీడ్ రోల్ చేసిన ఈ సిరీస్ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేసింది. జోన్స్, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తొలి రెండు ఎపిసోడ్‌లను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. ఆ తర్వాత మే నెలలో ప్రతి వారం ఒక్కో ఎపిసోడ్ విడుదల కానుంది. దాదాపు 300 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఈసిరీస్‌ను తెరకెక్కించారు. రూసో బ్రదర్స్, అమెజాన్ స్టూడియోస్. డేవిడ్ వెయిల్ దీనికి దర్శకత్వం వహించారు.