Actress Ranya Rao Arrested in Gold Smuggling: దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడింది హీరోయిన్ రన్యారావు (Ranya Rao). దాదాపు 15 కిలోలకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆమెను సోమవారం బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. డిజీపీ రామచంద్రరావు కూతురు రన్యారావు. కన్నడలో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే రన్యారావు కొంతకాలంగా దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తుంది. అయితే ఒక్క నెలలోనే ఆమె 15 సార్లు దుబాయ్‌కి వెళ్లింది.
దీంతో ఆమెపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో గత సోమవారం దుబాయ్ నుంచి వస్తున్న ఆమెను విమానాశ్ర అధికారులు తనిఖీలు నిర్వహించగా.. ఆమె లగేజ్ బ్యాగ్‌లో 15 కేజీల బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. దీంతో ఆమె అరెస్ట్ చేశారు పోలీసులు. బంగారంతో పాటు ఆమె వద్ద రూ. 2.6 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అరెస్ట్ తర్వాత రన్యారాం తాను డీజీపీ కె రామచంద్రరావు కూతురిని అని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. అయితే కె రామచంద్రరావు ఆమెకు సవంతి తండ్రి అవుతారని విచరాణలో వెల్లడైంది. ప్రస్తుతం రన్యారావును మార్చి 18 వరకు జ్యూడీషియల్ కస్టడీలో ఉంచనున్నారు.
నాలుగు నెలల క్రితమే పెళ్లి
కర్ణాటకలోని చిక్కమంగళూరులో జన్మించిన రన్యారావు హీరో, డైరెక్టర్ సుదీప్ చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసింది. సుదీప్ దర్శకత్వంలో వచ్చిన మాణిక్య(ప్రభాస్ మిర్చి మూవీకి ఇది రీమేక్) మూవీలో సహాయ నటిగా చేసింది. ఆత ర్వాత పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్‌గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. అయితే కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న రన్యారావు ఇటీవల పెళ్లి చేసుకుంది. నాలుగు నెలల క్రితం ఆమె పెళ్లి జరిగిందని ఆమె సవతి తండ్రి, డీజీపీ కె రామచంద్రరావు తెలిపారు. రన్యారావు అరెస్ట్‌పై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆమె అరెస్ట్ విషయం తెలిసి షాకయ్యామన్నారు. రన్యా పెళ్లయి నాలుగు నెలలు అవుతుందని, అప్పటి నుంచి తాను ఇంటికి రాలేదన్నారు. తన గురించి కానీ, తన భర్త చేసే వ్యాపారం గురించి కానీ తమకేమి తెలియదన్నారు.