Site icon Prime9

Actress Pragathi : కొత్త అవతారంలో ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చిన నటి ప్రగతి..

actress pragathi turned as power lifter and video got viral

actress pragathi turned as power lifter and video got viral

Actress Pragathi : వెండితెరపై త‌ల్లి, అత్త క్యారెక్ట‌ర్ లు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టి “ప్ర‌గ‌తి”. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రగతికి.. డిగ్రీ చదువుతున్నప్పుడే హీరోయిన్‪గా తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా ఓ ఏడు తమిళ సినిమాలు, ఓ మలయాళ చిత్రం చేసింది. తర్వాత పెళ్లి కావడంతో కొన్నిరోజుల నటనకు బ్రేక్ ఇచ్చింది. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది కానీ సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టింది. అలా అలా కొన్నాళ్లకు సినిమాల్లో పలు పాత్రల్లో చేసే అవకాశాలు వచ్చాయి. సూపర్ స్టార్ మహేశ్‌బాబు ‘బాబీ’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రగతి.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం తెలుగులో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది.

తల్లి, అత్త, కూతురు, చెల్లెలు ఇలా అన్ని పాత్రల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఎఫ్ 2, బాద్ షా సినిమాల‌తో ప్ర‌గ‌తి మరింత పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పాలి. కేవ‌లం సినిమాల‌తోనే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను అలరిస్తున్నారు నటి ప్రగతి. హాట్ హాట్ ఫోజుల‌తో ఫోటో షూట్ లు చేయ‌డంతో పాటు, కరోన లాక్ డౌన్ సమయంలో ఫిట్నెస్ వీడియోల‌తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.

ఓవైపు నటిగా ఎంటర్‪టైన్ చేస్తూనే మరోవైపు జిమ్‌లో వర్కౌట్స్‌తో బాగా పాపులర్ అయింది. అయితే అవన్నీ సరదాగా చేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టేసి ఊహించని షాక్ ఇచ్చింది.  ఇప్పుడు నిజంగానే పవర్ లిఫ్టర్ గా మారిపోయి అందరికీ షాకిచ్చింది. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది..రెండు నెలల క్రితం నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్‌లో నా కొత్త ప్రయాణమిది. రెండు నెలల క్రితం స్టార్ట్ అయిన ఈ జర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇది కూడా పూర్తి చేసే తీరతాను. ప్రస్తుతం నా స్కోరు 250. అయితే టార్గెట్ చాలా పెద్దదే.. దాన్ని చేరేవరకు ప్రయత్నిస్తాను అని అంటుంది ప్రగతి. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది.

 

Exit mobile version