Site icon Prime9

Actor Vishal : మరోసారి గొప్ప మనసు చాటుకున్న హీరో విశాల్.. ఏకంగా ఆ ఊరి కోసం !

Actor Vishal great gesture towards kumarachakkanapuram villagers

Actor Vishal great gesture towards kumarachakkanapuram villagers

Actor Vishal : హీరో విశాల్.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఒకరు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. తమిళంతో పాటు ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో కూడా పలు సినిమాలను రిలీజ్ చేసి మంచి హిట్లు అందుకున్నాడు విశాల్. ఇక రీసెంట్ గా విశాల్, ఎస్.జె. సూర్య కలిసి నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం ఇటీవల తెలుగులో కూడా విడుదలయి మంచి విజయాన్ని సాధించింది.

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో అభినయ హీరోయిన్ గా నటించగా.. జీవి ప్రకాష్ స్వరాలు సమకూర్చాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ కొట్టి విశాల్ కి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. కాగా విశాల్ చేసే సేవా కార్యక్రమాలు గురించి కూడా అందరికీ తెలిసిందే. తాజాగా విశాల్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఏకంగా ఒక గ్రామంలో ఎప్పటి నుంచో సమస్యగా మారిన త్రాగునీటి అవసరాన్ని తీర్చి మరోసారి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాల్ ప్రస్తుతం హరి దర్శకత్వంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఈతూత్తుకుడి జిల్లా లోని వీరకాంచీపురం, ఊశిమేసియాపురం, కుమారచక్కణపురం గ్రామాల్లో జరుగుతోంది. అయితే కుమారచక్కణపురం గ్రామంలో నీటి సమస్య ఉందని విశాల్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన విశాల్ తన సొంత ఖర్చులతో బోరు బావి వేయించారు. అంతే కాదు 5 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న సింథటిక్ వాటర్ ట్యాంక్ ని కూడా ఏర్పాటు చేశారు. గ్రామస్థులు నీటిని ఉపయోగించుకునేలా కుళాయిలు కూడా ఏర్పాటు చేశాడు. దీంతో ఏళ్ల తరబడి ఉన్న నీటి సమస్యని తీర్చిన విశాల్ కి తాము రుణపడి ఉంటామని చెబుతూ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version