Site icon Prime9

Rajendra Prasad: డబ్బుల్లేక మూడు నెలలు భోజనం చేయలేదు – ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

Actor Rajendra Prasad: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్క్రీన్‌పై కామెడీ ఎంతబాగా చేస్తారోలో ఎమోషన్స్‌ కూడా అదే స్థాయిలో పలికిస్తారు. తనదైన యాక్టింగ్స్‌ స్కిల్స్‌ నటి కిరీటి అనే బిరుదే పొందారు. వందటల సినిమాలు చేసిన ఆయన సినిమాల్లో అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఇటీవల ఆయన ఓ యూబ్యూట్‌ ఛానల్‌ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతిలో డబ్బుల్లేక దాదాపు మూడు నెలలు అన్నం తినలేదని అన్నారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “నేను ఇంజనీరింగ్‌ చేసిన తర్వాత ఉద్యోగం చేయకుండ సినిమాలు రావాలని నిర్ణయించుకున్ను. ఇదే విషయాన్ని మా నాన్నకు చెబితే అసహనం చూపించారు. ‘నీ ఇష్టానికి వెళ్తున్నావు. ఏం జరిగినా అది నీ వ్యక్తిగత విషయమే. ఒకవేళ ఫెయిల్‌ అయితే ఇంటికి రావద్దు’ అని కోప్పాడ్డారు. అయినా యాక్టర్‌ అవ్వాలనే ఆశతో మద్రాస్‌ వచ్చి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరా. అందులో గోల్డ్‌ మెడల్‌ వచ్చింది కానీ, అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో తిరిగి ఇంటికి వెళ్లాను. మా నాన్న ‘రావద్దన్నాను కదా ఎందుకు వచ్చావు’ అని సీరియస్ అయ్యారు. ఆయన అలా అనేసరికి చాలా బాధపడ్డాను.

తిరిగి మద్రాస్‌ వెళ్లిపోయా. అవకాశాలు లేవు, ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో చనిపోవాలని అనుకున్నా” అని చెప్పుకొచ్చారు. అయితే ఒకసారి నాకు దగ్గరగా అనిపించిన ఆత్మీయులను చూడాలనిపించింది. వాళ్లకు ఇళ్లకు వెళ్లి కలిసి మాట్లాడాను. అలా నిర్మాత పుండరీకాక్షయ్య గారి ఆఫీసుకు వెళ్లాను. అదే సమయంలో అక్కడ ‘మేలుకొలుపు’ సినిమాకు సంబంధించిన ఏదో చర్చ జరుగుతుంది. అప్పుడు రూం నుంచి బయటకు వచ్చిన ఆయన నన్ను చూసి ఏం మాట్లాడకుండ డబ్బింగ్ థియేటర్‌కు తీసుకువెళ్లారు. నాతో ఓ సీన్‌కి డబ్బింగ్ చెప్పించారు. అది ఆయనకు బాగా నచ్చింది. భలే సమయానికి దొరికావు ప్రసాద్‌.. మరో సీన్‌కి కూడా డబ్బింగ్ చెప్పమన్నారు. దీంతో నేను భోజనం చేసి మూడు నెలలు అయ్యింది సార్‌.

భోజనం పెడితే డబ్బింగ్‌ చెబుతానని అన్నాను. దీంతో ఆయన ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టారు. అప్పుడే నా బాధను ఆయనకు చెప్పాను. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, చివరి అవకాశంగా మిమ్మల్ని కలవడానికి వచ్నానుని అన్నారు. నేను అలా చెప్పగానికి ఆయన చాలా సీరియస్‌ అయ్యారు. జీవితం అంటే పోరాటమే అంటూ సూక్తులు బోధించిన నాకు ధైర్యం చెప్పారు. అలా ఇండస్ట్రీలో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా నా కెరీర్‌ ప్రారంభమైంది. ఎన్నో సినిమాలకు డబ్బింగ్‌ చెప్ఆను. అలా వచ్చిన డబ్బుతో మద్రాస్‌లో ఇల్లు కట్టాను. అక్కడే డైరెక్టర్‌ వంశీతో ప్రరిచయం, ఆ తర్వాత అతడి సినిమాల్లో నాకు అవకాశాలు రావడంతో హీరో అయ్యాను” అని చెప్పారు.

Exit mobile version
Skip to toolbar