Site icon Prime9

Fake University : దేశ వ్యాప్తంగా 20 ఫేక్ యూనివర్సిటీ లను గుర్తించిన యూజీసీ.. ఏపీలో ఆ రెండు ?

ugc announce 20 Fake University names in india

ugc announce 20 Fake University names in india

Fake University : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. దేశ వ్యాప్తంగా 20 యూనివర్సిటీ లను ఫేక్ యూనివర్సిటీ లుగా గుర్తించింది. కాగా ఆయా విశ్వవిద్యాలయాలకు డిగ్రీలు ప్రధానం చేసే అధికారం లేదని ప్రకటించింది. ఆ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలతో ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని తేల్చేసింది. యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్య కోసం యూనివర్సిటీలలో చేరేముందు సదరు యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉన్నది లేనిదీ చెక్ చేసుకోవాలని విద్యార్థులను యూజీసీ హెచ్చరించింది.

కాగా ఆ 20 యూనివర్సిటీ లలో దేశ రాజధాని ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్ లో 4, ఆంధ్రప్రదేశ్ లో 2, పశ్చిమ బెంగాల్ లో 2 , కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి లలో ఒక్కో యూనివర్సిటీ ఉన్నట్లు ప్రకటన చేశారు. ఇక ఏపీ విషయానికి వస్తే.. ఆ రెండు యూనివర్సిటీలు ఏవి అనగా.. గుంటూరు జిల్లా కాకుమానివారితోటలో గల క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీతో పాటు,, విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాలను నకిలీ యూనివర్సిటీలుగా తేల్చారు.

నకిలీ యూనివర్సిటీల వివరాలు (Fake University)..

క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ – ఆంధ్రప్రదేశ్

బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా – ఆంధ్రప్రదేశ్

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ – ఢిల్లీ

కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్ (దర్యాగంజ్) – ఢిల్లీ

యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ – ఢిల్లీ

వొకేషనల్ యూనివర్సిటీ – ఢిల్లీ

ఏడీఆర్ సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ – ఢిల్లీ

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ – ఢిల్లీ

విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ – ఢిల్లీ

ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ – ఢిల్లీ

గాంధీ హిందీ విద్యాపీఠ్ – ఉత్తరప్రదేశ్

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి – ఉత్తరప్రదేశ్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ – ఉత్తరప్రదేశ్

భారతీయ శిక్షా పరిషత్ – ఉత్తరప్రదేశ్

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ –  పశ్చిమ బెంగాల్

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ –  పశ్చిమ బెంగాల్

బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ – కర్ణాటక

సెయింట్ జాన్స్ యూనివర్సిటీ – కేరళ

రాజా అరబిక్ యూనివర్సిటీ –  మహారాష్ట్ర

శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ – పుదుచ్ఛేరి

Exit mobile version