TS EdCET Results 2022: రేపు తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలను అగష్టు 26 న ప్రకటించనున్నారు. బీఈడీ విద్యార్థుల ప్రవేశ పరీక్షల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఎడ్‌సెట్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఫలితాలు వెలువడిన తరువాత https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఎడ్‌సెట్‌ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

  • Written By:
  • Updated On - August 25, 2022 / 03:07 PM IST

Hyderabad: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలను అగష్టు 26న ప్రకటించనున్నారు. బీఈడీ విద్యార్థుల ప్రవేశ పరీక్షల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఎడ్‌సెట్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఫలితాలు వెలువడిన తరువాత https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఎడ్‌సెట్‌ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. జులై 26, 27 తేదీల్లో తెలంగాణ ఎడ్‌సెట్‌ పరీక్షలను నిర్వహించిన అందరికి తెలిసిన విషయమే.

తెలంగాణ ( ఐసెట్ ) స్టేట్‌ ఇంటిగ్రేటేడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలు ఆగస్టు 27న విడుదల అవ్వనున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం ఐసెట్‌ ఫలితాలు శనివారం ఆగస్టు 27 న విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఐసెట్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 75,958 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాల విడుదల అనంతరం ఈ వెబ్‌సైట్‌లో https://icet.tsche.ac.in/ విద్యార్ధులు ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

విద్యార్ధుల పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను ఆధారంగా ఫలితాలను చూసుకోవచ్చు. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐసెట్‌ 2022 పరీక్ష జులై 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన విషయం మన అందరికి తెలిసిన విషయామే. దీనికి సంబంధించిన ఆన్సర్‌ కీ ఆగస్టు 4న విడుదల చేసారు. నేడు ఐసెట్ ఫలితాలతోపాటు ఆన్సర్‌ కీని కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.