Site icon Prime9

TS EAMCET: టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఎప్పుడంటే?

TS EAMCET

TS EAMCET

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఈ షెడ్యూల్ ను విడుదల చేసింది. గురువారం ఎంసెట్ ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు శనివారం రిలీజ్ చేశారు. ఈ కౌన్సిలింగ్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు.

జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు ఫేజ్ ల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలు జరగనున్నాయి. జూన్ 26 నుంచి తొలి విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక జూన్ 26 న ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. తర్వాత జూన్ 28 నుంచి జులై 6 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్ జరగనుంది. జూన్ 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి.

కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇలా..(TS EAMCET)

జులై 12న తొలి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

జులై 12 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

జూలై 21 నుంచి రెండో విడత ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్

జూలై 21 నుంచి 24 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలి.

జులై 28న రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు చేస్తారు.

ఆగస్టు 2 నుంచి తుది విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ జరుగుతుంది.

ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

ఆగస్టు 7న ఇంజనీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది.

ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు ఇస్తారు.

ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల నిబంధనలు విడుదల చేస్తారు.

 

Exit mobile version