TS EAMCET 2023 Results: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?

రాష్ట్రంలో మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్ష, మే 12 నుంచి 15 వరకు 6 విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎంసెట్ పరీక్ష ప్రాథమిక కీ,

TS EAMCET 2023 Results: విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తోన్న తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలకు సిద్దమయ్యాయి. మే 25 న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి వి. కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి, జేఎన్‌టీయూ,హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని గోల్డెన్‌ జూబ్లీ హాలులో ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తారని ఎంసెట్‌ కన్వీనర్‌ డా. బి. డీన్‌ కుమార్‌ వెల్లడించారు.

 

ఫలితాలను చెక్ చేసుకోవాలంటే..

రాష్ట్రంలో మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్ష, మే 12 నుంచి 15 వరకు 6 విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎంసెట్ పరీక్ష ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌లను విడుదల చేసి అధికారులు అభ్యంతరాలను స్వీకరించారు. తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. కాగా, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ పరీక్షకు దాదాపు లక్ష మందికి విద్యార్థులు పైగా హాజరైనట్టు సమాచారం. ఫలితాలను https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

 

వెయిటేజ్ మార్కుల తొలగింపు

ఎంసెట్ పరీక్షలకు ముందు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉండదని ప్రకటించింది. వెయిటేజ్ మార్కుల విధానాన్ని శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులపై ఇంటర్ మార్కుల భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మసీ రంగాల్లో ప్రవేశాలకు ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ అమలు చేస్తూ తొలిసారిగా 2011 లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎంసెట్ మార్కులకు 75 శాతం.. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ కేటాయించేవారు. ఈ రెంటింటిని కలిపి ర్యాంకులను ఇచ్చేవారు. తాజా నిర్ణయంతో ఇకపై ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులను కేటాయిస్తారు.