TS EAMCET 2023 Results: విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తోన్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలకు సిద్దమయ్యాయి. మే 25 న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే ఫలితాల విడుదల విషయంలో ముఖ్య అప్ డేట్ వచ్చింది. ముందుగా అనుకున్నట్టు గురువారం ఉదయం 11 గంటలకు ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలి. కానీ, సమయంలో స్వల్ప మార్పులు చేస్తూ.. ఉదయం 9.30 గంటలకే ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎంసెట్ కన్వీనర్ పేర్కొన్నారు. కాబట్టి గురువారం (మే 25) రెండు గంటలు ముందుగానే (9.30 గంటలకు) తెలంగాణ ఎంసెట్ ఫలితాలు రిలీజ్ అవ్వనున్నాయి.
ఫలితాలను చెక్ చేసుకోవాలంటే..(TS EAMCET 2023 Results)
రాష్ట్రంలో మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష, మే 12 నుంచి 15 వరకు 6 విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎంసెట్ పరీక్ష ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్‌లను విడుదల చేసి అధికారులు అభ్యంతరాలను స్వీకరించారు. తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. కాగా, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు దాదాపు లక్ష మందికి విద్యార్థులు పైగా హాజరైనట్టు సమాచారం. ఫలితాలను https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.