Site icon Prime9

TS Eamcet 2023 : నేటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ ఎంసెట్ పరీక్షలు..

TS Eamcet 2023 exam details and rules

TS Eamcet 2023 exam details and rules

TS Eamcet 2023 : తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ల హారన్ మోగింది. కాగా ఈ తరుణంలోనే ఎంసెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు మే 10, 11 తేదీల్లో.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14 డేట్స్‌లో జరగనున్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహిస్తున్న ఈ ఎంసెట్ పరీక్షల కోసం దాదాపు 3.20 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

కాగా ఈ ఎంసెట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పరీక్షల కోసం తెలంగాణలో 104 కేంద్రాలు, ఏపీలో 33 కేంద్రాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి కొత్తగా 28 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

పరీక్ష నియమాలు (TS Eamcet 2023)..

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీకి సంబంధించిన ఏదైనా ఒరిజినల్ కార్డ్‌ని తీసుకెళ్లాలి.

జిరాక్స్‌లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు తెలిపారు.

అదే సమయంలో ఈ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రాలకు తప్పనిసరిగా రావాలని సూచించారు.

కాలిక్యులేటర్లు, రిస్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష హాలులోకి అనుమతించబోమని తెలిపారు.

విద్యార్థుల బయోమెట్రిక్‌ సేకరిస్తారు కాబట్టి.. గోరింటాకు, ఇతర డిజైన్‌లు చేతిలో ఉంటే బయోమెట్రిక్‌ వేసేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

Exit mobile version