Prime9

ITI Admissions: ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలు.. ఇప్పుడే అప్లై చేసుకోండి

TGSRTC ITI Colleges: ఐటీఐ కోర్స్ చేయాలనుకునే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్, వరంగల్ లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్ లలో ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్ లలో ప్రవేశాలు జరగుతున్నాయని, ఈ కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆయా ట్రేడ్స్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు కోరుకున్న టీజీఎస్ఆర్టీసీ బస్ డిపోల్లో అప్రెంటిస్ షిప్ సౌకర్యాన్ని కూడా సంస్థ కల్పిస్తుంది.

ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ విధానంలో ఈనెల 21లోపు iti.telangana.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం సూచించింది. ఐటీఐ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే నిరుద్యోగ యవతకు మంచి ట్రైనింగ్ తో మంచి భవిష్యత్తు లభిస్తుందని, తక్కువ సమయంలోనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కాలేజీలను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఐటీఐ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ లోని హకీంపేట, వరంగల్ ములుగు రోడ్ లోని ఐటీఐ కాలేజీలో నేరుగా సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ కూడా చేశారు.

Exit mobile version
Skip to toolbar