Site icon Prime9

TS Police Jobs: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. రేపే చివరి తేదీ

telangana police recruitment part-2 application

telangana police recruitment part-2 application

TS Police Jobs: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసిన సంగతి విదితమే. అయితే, ఈ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు పార్ట్ 2కు అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంనేందుకు నవంబర్ 10వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించింది. కాగా రేపటితో ఆ గడువు ముగుస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలా మంది అభ్యర్థులు ఇంకా పార్ట్-2 దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయలేదని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ వెల్లడించింది.

ఇదిలా ఉంటే ఈ పార్ట్2కు అప్లై చేసుకోవడానికి క్యాస్ట్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుందని వాటి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని అధికారులు త్వరితగతిన ఆ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు తేదీని మరింత కాలం పొడిగించాలని కోరుతున్నారు.

మరోవైపు ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యి.. ఇప్పటి వరకు పార్ట్2 అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయని అభ్యర్థులకు టీఎస్ఎల్పీఆర్బీ అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. నవంబర్ 10 తేదీ లోపు పూర్తి చేయాలని మెసేజ్‌లో సూచించింది.

ఇదీ చదవండి: ఆ కళాశాలల్లో పీజీ కోర్సులు రద్దు

 

Exit mobile version