Site icon Prime9

AP SSC Exams: ఏపీలో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు

SSC Exams Starts from today In Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటితో ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో పూర్తి కానున్నాయి. అయితే మార్చి 31న రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని చివరి పరీక్ష సోషల్ స్టడీస్ విషయంలో ఏమైనా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

కాగా, ఈ పరీక్షకు 6,49,884 మంది విద్యార్థులు హాజరవుతుండగా..ఇందులో 6,19,275 మంది విద్యార్థులు రెగ్యులర్ ఉన్నారు. ఉదయం 9.30 నిమిషాల నుంచి 12.45 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే విద్యార్థులు ప్రశ్నపత్రంను క్షుణ్ణంగా చదివేందుకు 15 నిమిషాలు అదనంగా కేటాయించారు.

అలాగే, విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లే రవాణా సదుపాయం కల్పించారు. పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. మొత్తం 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇందులో 163 సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరా సర్వెలెన్స్ ఏర్పాటు చేశారు.

Exit mobile version
Skip to toolbar