Site icon Prime9

SBI Recruitment 2022: నిరుద్యోగులకు ఎస్‌బీఐ శుభవార్త.. 5008 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

SBI Server Down

SBI Server Down

SBI Junior Associates Recruitment 2022: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)  నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.  తాజాగా 5008 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా జూనియర్ అసోసియేట్స్ లేదా కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 225 పోస్టులు ఖాళీలున్నాయి. అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేయవచ్చు.

సర్కిల్ వారీగా ఖాళీలు:

అహ్మదాబాద్- 357

బెంగళూరు- 316

భోపాల్- 481

బెంగాల్- 376

భువనేశ్వర్- 170

చండీగఢ్- 225

చెన్నై- 362

లఖ్‌నవూ- 152

హైదరాబాద్- 225

జైపూర్ – 284

కేరళ- 273

 దిల్లీ – 631

 ముంబయి మెట్రో- 747

మహారాష్ట్ర- 50

నార్త్‌ ఈస్టర్న్‌- 359

విద్యార్హత: డిగ్రీపూర్తి చేసిన వారు అర్హలు. డిగ్రీ చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. 01.08.2022 నాటికి  20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని పేర్కొనింది. SC/STలకు ఐదేళ్లు, OBC మూడేళ్లు, PDWD(జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. నెలకు రూ.19900 బేసిక్ జీతం ఉంటుందని తెలిపింది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక జరుగుతుందని. స్థానిక భాషలోనే పరీక్ష రాయవచ్చని, పరీక్ష ముఖ్యంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ గా నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. పరీక్ష కేంద్రాలు మరియు పరీక్ష సిలబస్ మరియు ఇతర వివరాల కోసం ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

పరీక్ష ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ దరఖాస్తు దారులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

Exit mobile version