Site icon Prime9

NFC Recruitment 2022: పదోతరగతి అర్హతతో అణుశక్తి విభాగంలో కొలువులు

NFC notification 2022

NFC notification 2022

NFC Recruitment 2022: పదోతరగతి, ఐటీఐ విద్యార్ఙత కేంద్ర ప్రభుత్వ కొలువులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సంస్థలో ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగం దరఖాస్తులు కోరుతోంది.

2022-23 సంవత్సరానికి గానూ 345 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 ఏళ్ల కంటే తక్కువగా ఉండకూదు. అప్రెంటిషిప్ చేసేటప్పుడు ఒక్కో అభ్యర్థికి స్టైఫండ్ నెలకు రూ. 7,700 నుంచి 8,050 గా ఇవ్వనుంది. అభ్యర్థులను పదోతరగతి/ ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎన్‌ఏపీఎస్‌ పోర్టర్‌ లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేది 05 నవంబర్ 2022. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

మొత్తం ఖాళీలు అప్రెంటిస్: 345 ఖాళీలు కాగా, విభాగాల వారిగా ఖాళీల సంఖ్య ఇలా..

అటెండెంట్ ఆపరేటర్ ఖాళీలు: 7
ఎలక్ట్రీషియన్ ఖాళీలు: 26
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఖాళీలు: 27
ఫిట్టర్ ఖాళీలు: 119
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఖాళీలు: 6
లేబొరేటరీ అసిస్టెంట్ ఖాళీలు: 8
మెషినిస్ట్ ఖాళీలు: 17
కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ ఖాళీలు: 5
టర్నర్ ఖాళీలు: 27
కార్పెంటర్ ఖాళీలు: 2
కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) ఖాళీలు: 74
మెకానిక్ డీజిల్ ఖాళీలు: 2
ప్లంబర్ ఖాళీలు: 4
వెల్డర్ ఖాళీలు: 21

ఇదీ చదవండి: రాత పరీక్ష లేకుండా రైల్వే జాబ్స్ వెంటనే అప్లై చేసుకోండి!

Exit mobile version