Site icon Prime9

MBBS: నేటి నుంచి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ

MBBS seats notifications

MBBS seats notifications

MBBS: ఎంబీబీఎస్‌ చేయాలనుకునే విద్యార్థులకు తెలంగాణలోని వరంగల్ లో ఉండే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.

నేటి నుంచి ఈ కోటా సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు ప్రారంభం అయ్యాయి. తొలి విడత కింద 30వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి నవంబరు 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ అవకాశం ఉందని విశ్వవిద్యాలయం వెల్లడించింది. విద్యార్థులు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపింది.
తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు మాత్రమే ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చెయ్యనున్నారు. కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలను విశ్వవిద్యాలయం వెబ్ సైట్లో పొందుపరిచింది. పూర్తి వివరాల కోసం www.knrhs.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని వర్సిటీ సూచించింది.

ఇదీ చదవండి:  ఆ పీహెచ్‌డీలకు గుర్తింపు లేదు.. వెల్లడించిన యూజీసీ

Exit mobile version