LIC Recruitment 2022: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి జాబ్ నోటిఫికేషన్ ఇదే!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు పలు రకాల పోస్టుల నోటిఫికేషన్ వెల్లడించారు.ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (CTO), చీఫ్ డిజిటల్ ఆఫీసర్ (CDO) మరియు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 04:32 PM IST

LIC Recruitment 2022: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు పలు రకాల పోస్టుల నోటిఫికేషన్ వెల్లడించారు.ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (CTO), చీఫ్ డిజిటల్ ఆఫీసర్ (CDO) మరియు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ వెల్లడించారు. దరఖాస్తులు చేసుకునే వారు అక్టోబర్ 10, 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.అర్హత గల అభ్యర్థుల ముందుగా దరఖాస్తులు పెట్టుకోండి. దీనిలో మీ పేరు, ఈ మెయిల్, మీ యొక్క వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ మీ ఫోన్ నెంబరుకు వస్తాయి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయడానికి 2022 అక్టోబర్ 10 వరకు ధరఖాస్తులు పెట్టుకోవచ్చు.
దరఖాస్తు వివరాలను సవరించడానికి 2022 అక్టోబర్ 10 వరకు ఉంటుంది.
మీ పెట్టుకున్న దరఖాస్తును ప్రింట్ తీసుకోవడానికి 2022 అక్టోబర్ 25 వరకు ఉంటుంది.

విద్యార్హతలు

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ , డిజిటల్ మార్కెటింగ్ లో పాస్ అయి ఉండాలి.

దరఖాస్తు ఫీజు ఈ విధంగా ఉంటుంది

జనరల్, Obc అభ్యర్థులు రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలిసి ఉంటుంది. ఏస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాలిసిన అవసరం లేదు.

ఎంపిక విధానం ఈ విధంగా ఉంటుంది

స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూ కొరకు షార్ట్-లిస్ట్ చేయబడతారు. స్క్రీనింగ్ టెస్టు, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపించిన అభ్యర్థులను ఈ పోస్టుకు ఎంపిక చేస్తారు.