Site icon Prime9

LIC: ఇంటర్ విద్యార్హతతో ఎల్ఐసీలో ఉద్యోగాలు

Lic Investments

Lic Investments

LIC: ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారా అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే. నిరుద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) శుభవార్త చెప్పింది. పార్ట్ టైమ్ ఏజెంట్, ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఖాళీల భర్తీని చేపట్టేందుకు ఎల్ఐసీ ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు విభాగాలలో 200 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ఇంటర్, డిగ్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. పార్ట్ టైమ్ ఏజెంట్ గా నియమితులైన వారికి రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకు, ఇన్సూరెన్స్ అడ్వైజర్లకు రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు జీతం ఇవ్వనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది.

మొత్తం ఖాళీలు: పార్ట్ టైమ్ ఏజెంట్: 100, పార్ట్ టైమ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్: 100

అర్హతలు: పార్ట్ టైమ్ ఏజెంట్- 12వ తరగతి ఉత్తీర్ణత, పార్ట్ టైమ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్- ఏదైనా డిగ్రీ

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు 2 డిసెంబర్ 2022 లోగా www.ncs.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

ఇదీ చదవండి:  రాత పరీక్షలేకుండా.. పది అర్హతతో రైల్వేలో 2,521 ఉద్యోగాలు

Exit mobile version