Site icon Prime9

GDS Results: జీడీఎస్ తెలుగు రాష్ట్రాల ఫలితాలొచ్చేశాయి

gds results out

gds results out

GDS Results: భారత తపాలా శాఖలో గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్) రిక్రూట్‌మెంట్‌ 2022 ఫలితాలొచ్చేశాయ్. బుధవారం (అక్టోబర్‌ 18)న జీడీఎస్ కు సంబంధించిన ఫలితాలను పోస్టల్ శాఖ రిక్రూట్ మెంట్ కమిటీ వారు విడుదల చేశారు.

అయితే తాజాగా విడుదల చేసిన జీడీఎస్ ఆరో లిస్టులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిళ్లకు సంబందించి సెలెక్ట్‌ అయిన అభ్యర్ధుల జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఈ పోస్టుల నియామకాలకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండానే పదో తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేశారు.
ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టుల్లో విధులకు హాజరుకావలసి ఉంటుందని తపాలశాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇండియా పోస్టు విభాగం దరఖాస్తుల్ని స్వీకరించిన విషయం విదితమే. కాగా తాజాగా విడుదలైన ఫలితాల్లో అర్హులుగా ఎంపికైన వారికి మొదటగా ద్రువ పత్రాల పరిశీల ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

ఇదీ చదవండి: గ్రూప్-1 ప్రిలిమ్స్ లో కటాఫ్ ఉండదు

Exit mobile version