Site icon Prime9

Triple IT Admissions: గ్రామీణ ప్రాంతాల విద్యార్దులకు వరం.. IIIT RGUKT.. ఏపీలోని ట్రిపుల్ ఐటీలలో ప్రవేశం పొందడం ఎలా?

Triple IT Admissions

Triple IT Admissions

Triple IT Admissions: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనల నుంచి రూపు దాల్చిన సంస్దలు IIIT RGUKT.. రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. గ్రామీణ ప్రాంతాల విద్యార్దులు కేవలం టెన్త్ క్లాస్ మార్కులతో ప్రతిష్టాత్మక సంస్దల్లో ఇంజనీరింగ్ డిగ్రీని చదువుకునే విధంగా వీటిని స్దాపించారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఐఐటీలు, ఎన్ఐటీలలో ప్రవేశం సంపాదించాలంటే కోచింగ్ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవేమీ లేకుంగా టెన్త్ క్లాస్ అయిన తరువాత ఆరేళ్లు చదవితే బిటెక్ డిగ్రీ సంపాదించవచ్చని డాక్టర్ సతీష్ కుమార్  ప్రైమ్  9  న్యూస్ కు  తెలిపారు.

టెన్త్ క్లాస్ మార్కులతోనే ప్రవేశం..(Triple IT Admissions)

ఏపీలోని నూజివీడు, కడప, శ్రీకాకుళం, ఒంగొలు, ఇడుపుల పాయల్లో ఉన్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లు ఒక్కో దాంట్లో 1,100 సీట్లు ఉన్నాయి.టెన్త్ క్లాస్ మార్కుల మెరిట్ బట్టి వీటిలో ప్రవేశాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో టెన్త్ చదివిన విద్యార్దులకు ప్రోత్సాహం ఇవ్వడానికి 4 శాతం అదనపు పాయింట్లు కలిపి ర్యాంకింగ్ ఇస్తారు. ఆంధ్ర, తెలంగాణ విడిపోయినపుడు ఏపీకి 85 శాతం, ఏపీ, తెలంగాణకు కలిపి 15 శాతం సీట్లు కేటాయించారు. నాన్ లోకల్, ఎన్నారై విద్యార్దులకు 5 శాతం సీట్లు ఉంటాయి. నిబంధనలమేరకు రిజర్వేషన్లు ఉంటాయిని సతీష్ కుమార్ తెలిపారు.

రెండేళ్ల తరువాత బిటెక్ లో ప్రవేశం..

ఇది 6 సంవత్సరాల కోర్సు. ఇందులో రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ కోర్సు ఉంటుంది.ఇందులో బయాలజీ కూడా ఉంటుంది. తరువాత వారికి వచ్చిన మార్కులు బట్టి ఇంజనీరింగ్ లో బ్రాంచ్ ను ఎంచుకోవచ్చని సతీష్ కుమార్ చెప్పారు. సుమారుగా ఏడు రకాల బ్రాంచుల్లో విద్యార్దుల ర్యాంకు మేరకు ఇంజనీరింగ్ కోర్సు ఉంటుంది. ఇంటర్మీడియట్ కోర్సుకు రూ.40,000 కోర్సుకు రూ.50,000 ఫీజు ఉంటుంది. ఫీజులకు సంబంధించి ప్రభుత్వం అందించే విద్యాదీవెన తదితర పధకాలు వర్తిస్తాయి. హాస్టల్ ఫీజు నెలకు రూ.3000 ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్దులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడకు వచ్చిన తరువాత ఇబ్బంది పడకుండా వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఉంటుంది. మంచి ఫ్యాకల్టీ, కోర్సు పూర్తి చేసిన వారు మంచి ఉద్యోగాలు పొందడానికి ప్లేస్ మెంట్ సెల్స్ ఉన్నాయి. మరో విషయమేమిటంటే ట్రిపుల్ ఐటీల్లో రెండు సంవత్సరాలు కోర్సు చదివిన తరువాత హైదరాబాద్ గచ్చిబౌలి లోని ట్రిపుల్ ఐటీలో బిటెక్ చేరవచ్చు. ప్రస్తుతం ఈ క్యాంపస్ లలో ఎంటెక్ కోర్సు ను ప్రవేశ పెట్టారు. ఇది పూర్తి చేసిన వారికి పీహెచ్డీ ప్రవేశాలు కూడా ప్రారంభిస్తున్నారు. అందువలన టెన్త్ క్లాస్ మెరిట్ ఉన్న విద్యార్దులకు ట్రిపుల్ ఐటీలు మంచి వరమని వీటని వినియోగించుకోవాలని సతీష్ కుమార్ చెబుతున్నారు. అలానే IIIT RGUKT సంస్థల్లో చేరాలి అనుకునే వారు మరియు సలహాలు, సూచనలు కోరే వారు.. ఉన్నత విద్యను టాప్ కాలేజీల్లో చదివి కెరీర్ ని ఉజ్వలంగా మార్చుకోవాలని అనుకునే వారు.. పూర్తి వివరాల కొరకు కెరీర్ గైడెన్స్ వారిని సంప్రదించగలరు 8886629883..

 

Exit mobile version