Group-1 pattern: గ్రూప్ 1 ప్రాథమిక ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇక ప్రధాన పరీక్ష ఎలా ఉంటుంది అనే విషయాన్ని TSPSC ప్రకటించింది. ఈ మేరకు సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. పరీక్ష విధానం ఎలా ఉంటుంది అనే వివరాలను వెబ్ సైట్లో పొందుపరిచినట్లు పేర్కొంది.
ప్రధానపరీక్షలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులను కేటాయించారు. పదోతరగతి స్థాయిలో ఇంగ్లిష్ పరిజ్ఞానంపై 150 మార్కులకు అర్హత పరీక్షను టీఎస్ పీఎస్సీ నిర్వహించనుంది.
పరీక్ష విధానం ఈ విధంగా ఉంటుంది.
పేపర్-1 : జనరల్ ఎస్సే
మెుదటి పేపర్ లో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 50 మార్కుల చొప్పున కేటాయించారు.
ఒక్కో సెక్షన్‌లో మూడు ప్రశ్నలు ఉండగా.. ప్రతిసెక్షన్‌లో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి.
సమాధానం వెయి పదాలకు తగ్గకుండా ఉండాలి. మూడు సెక్షన్లకు కలిపి 150 మార్కులు ఉంటాయి.
పేపర్-2 : చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ
పేపర్-3 : భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన
పేపర్-4 : ఎకానమీ, డెవలప్‌మెంట్
పేపర్-2, 3, 4లలో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో అయిదు ప్రశ్నలకు సమాధానం రాయాలి.
ప్రతి సెక్షన్‌కు 50 మార్కులుంటాయి. ప్రశ్నకు 200 పదాలకు తగ్గకుండా సమాధానం రాయల్సి ఉంటుంది.
ఒక్కోప్రశ్నకు పది మార్కులు కేటాయించారు. అయితే ఒక్కో సెక్షన్‌లో అయిదు ప్రశ్నలకు గాను.. తొలిరెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
మిగతా మూడు, నాలుగు, అయిదు ప్రశ్నల్లో ఛాయిస్ ఆప్షన్ అవకాశం ఉంటుంది.
పేపర్-5 : సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి రెండు సెక్షన్లలో అయిదు ప్రశ్నల చొప్పున ఉంటాయి.
ఈ సెక్షన్లలో తొలిరెండు ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబు ఇవ్వాలి. మిగతా మూడు ప్రశ్నలకు ఛాయిస్ ఉంటుంది.
ప్రశ్నలకు సమాధానం 200 పదాల్లో ఉండాలి. ఇక మూడో సెక్షన్‌లో మొత్తం 30 ప్రశ్నలుంటాయి.
వీటిలో 25 ప్రశ్నలకు సమాధానమివ్వాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 50 మార్కులు ఉంటాయి.
పేపర్-6 : తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు
ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో అయిదు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం రాయాలి.
ప్రతి ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కోప్రశ్నకు పది మార్కులు చొప్పున మొత్తం 15 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించింది.
అయితే ఒక్కో సెక్షన్‌లోని అయిదు ప్రశ్నల్లో తొలిరెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరి ఇవ్వాలి.
ఇందులో ఛాయిస్ ఉండదు. మూడు, నాలుగు, అయిదు ప్రశ్నల్లో ఛాయిస్ ఆప్షన్ ఉంటుంది.
జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష: ఇందులో పదిహేను ప్రశ్నలు ఉంటాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/