Site icon Prime9

Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పోస్టులకు ధరఖాస్తులను కోరుతుంది!

central bank prime9news

central bank prime9news

Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పలు పోస్టుల భర్తీకి ధరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల కోసం అనుభవం ఉన్న అభ్యర్ధులు దరఖాస్తులు మాత్రమే ఆమోదించబడతాయని ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2022 సెప్టెంబర్ 28 నుంచి దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ 2022 అక్టోబర్ 17 వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తులు పెట్టుకునే అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

IT సెక్యూరిటీ అనలిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ (క్రెడిట్), క్రెడిట్ ఆఫీసర్, డేటా ఇంజనీర్, లా ఆఫీసర్, IT, ఎకనామిస్ట్, డేటా సైంటిస్ట్, రిస్క్ మేనేజర్, IT SOC అనలిస్ట్, సెక్యూరిటీ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కింద మొత్తం 110 పోస్టులను భర్తీ చేయనున్నారు.

కావలిసిన అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలు వేరు వేరుగా ఉన్నాయి. పోస్టులను బట్టి అర్హతలు ఉన్నాయి. డిగ్రీ, పీజీలతో పాటు, పోస్టులకు సంబంధించిన సబ్జెక్ట్ లో స్పెషలైజేషన్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.

దరఖాస్తు ఫీజు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులకు, దరఖాస్తు ఫీజు రూ. 850 చెల్లించాలిసి ఉంటుంది. ఐతే  SC, ST, అభ్యర్థులు దరఖాస్తు ఫీజు  175 రూపాయలు.

ధరఖాస్తులు అప్లై చేసుకునే ముఖ్యమైన తేదీలు ఇవే..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ – 28 సెప్టెంబర్ 2022 నుంచి మొదలవుతుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ – 17 అక్టోబర్ 2022 వరకు ఉంటుంది.

ఎంపిక అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ – డిసెంబర్ 2022 లో జరగనుంది.

ఇంటర్వ్యూ అడ్మిట్ కార్డ్ – నవంబర్ 2022 న విడుదల చేస్తారు.

Exit mobile version