MBBS Seat in Chhattisgarh: నీట్ ఎగ్జామ్ ద్వారా MBBS కోర్సుల్లో ప్రవేశాలకు పలు రాష్ట్రాలు నోటిఫికేషన్ జారీ చేస్తున్నాయి. అయితే ఎక్కువ ర్యాంకు వచ్చి ఏపీ, తెలంగాణలో ‘B’ కేటగిరీ సీట్లకు ఎక్కువ ఫీజు చెల్లించలేని విద్యార్దులకు ప్రత్యమ్నాయాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ . మనకు పక్కనే ఉన్న ఛత్తీస్ గఢ్ లో కేవలం7.5 లక్షలకే ‘B’ కేటగిరీ MBBS సీటు వస్తుందని వీటిని నాన్ లోకల్ కోటాలోమ పొందవచ్చని ఆయన చెప్పారు. ఛత్తీస్ గఢ్ లో 15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. బాలాజీ మెడికల్ కాలేజీ రాయపూర్, శంకరాచార్య ఇనిస్టిట్యూట్, భిలాయ్, రాయపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,ఛత్తీస్ గడ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ .. ఈ కాలేజీలన్నింటిలోనూ ‘B’ కేటగిరీ సీట్లకు ఫీజు రూ.7,5 లక్షలు ఉంటుందని వీటికి నాన్ లోకల్ కోటాలో ప్రవేశం పొందవచ్చని సతీష్ చెబుతున్నారు. అంతేకాదు ఇక్కడ ఉండే ఎన్ఆర్ఐ కోటా సీట్లు భర్తీ కాకపోతే వాటిలో కూడా నాన్ లోకల్ కోటాలో అడ్మిషన్ పొందవచ్చని అన్నారు. దీనికి ఫీజు 30 నుంచి 35 వేల యూఎస్ డాలర్లు ఉంటుందని అన్నారు. ఆరేళ్ల పాటు ఇక్కడ వైద్యవిద్య నభ్యసించడం వల్ల హిందీలో ప్రావీణ్యం ఉంటుందని అందువలన కోర్సు పూర్తయ్యాక దేశంలో ఎక్కడయినా పనిచేసుకునే సౌలభ్యం ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఈ కో ర్సులకు సంబంధించి విద్యార్దులకు ఎటువంటి సందేహాలు ఉన్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ 8886629883ను సంప్రదించవచ్చు.