Site icon Prime9

APPSC: ఏపీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

APPSC

APPSC

APPSC: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఏపీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలయ్యింది. యునాని విభాగంలో 26 మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకుని ఉండాలి. 18 నుంచి 42 ఏళ్ల మధ్య అభ్యర్ధుల వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్‌ ఉంటుంది.

ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 21, 2022వ తేదీ ముగుస్తుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.370లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పరీక్ష ఇంగ్లీష్‌ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. మొత్తం 450 మార్కులకు గానూ ఈ రాత పరీక్షలను నిర్వహిస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.

ఇదీ చదవండి: మరో ప్రాణం తీసిన లోన్ యాప్స్

 

Exit mobile version