Site icon Prime9

APPSC Group 1: రేపటి నుంచి ఏపీలో గ్రూప్1 మెయిన్స్.. తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్

APPSC Group 1

APPSC Group 1

APPSC Group 1: ఆంధ్రప్రదేశ్ లో శనివారం (జూన్ 3) నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మెయిన్స్ పరీక్షలకు 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెయిన్స్ పరీక్ష జరుగుతుంది. 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు. జూన్ 10 వరకు మెయిన్స్ పరీక్షలు కొనసాగుతాయి.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఈ సారి ఆఫ్ లైన్ లోనే నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లపై ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ సెక్రటరీ జె. ప్రదీప్ కుమార్ పరిశీలించారు.

పటిష్ట చర్యలు..(APPSC Group 1)

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పూర్తి స్థాయి పరీక్షల నిర్వహణ జరుగనుంది. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేసినట్టు అధికారులు తెలిపారు.

ఈ సారి అభ్యర్థులకు బయోమెట్రిక్‌తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అదే విధంగా ఈసారి 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 58 మంది దివ్యాంగులు స్క్రైబ్స్ కు అనుమతి కోరగా.. అందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు.

 

Exit mobile version