Site icon Prime9

AP Polycet 2023 : నేడు ఏపీ పాలిసెట్ 2023 ఎంట్రన్స్ ఎగ్జామ్..

ap-polycet-2023 entrance exam details

ap-polycet-2023 entrance exam details

AP Polycet 2023 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలను కోరుతూ నిర్వహించే ఏపీ పాలిసెట్‌–2023 పరీక్ష నేడు జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 29 విభాగాల్లో మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 61 పట్టణాల్లో 499 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. కాగా అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

ఈ ఏడాది పాలిసెట్‌కు మొత్తం 1,59,144 మంది దరఖాస్తు చేశారని వివరించారు. వీరిలో 96,429 మంది బాలురు, 62,715 మంది బాలికలు ఉన్నారన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 21 వేల దరఖాస్తులు పెరిగాయని చెప్పారు.

నియమాలు.. 

పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.

పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 10 గంటల నుంచే అనుమతించనున్నారు.

పరీక్ష ప్రారంభించిన తర్వాత ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

పరీక్ష విధానం (AP Polycet 2023)..

పాలిసెట్‌ పరీక్షను ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు.

మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి.

మొత్తం మూడు విభాగాల నుంచి 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది.

మ్యాథ్స్‌–50, ఫిజిక్స్‌–40, కెమిస్ట్రీ–30 చొప్పున ప్రశ్నలు వస్తాయి.

పరీక్ష సమయం రెండున్నర గంటలు.

పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి.

ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు.

ఎటువంటి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానంలో అమల్లో లేదని అధికారులు వెల్లడించారు.

ప్రవేశ పరీక్ష ఫలితాలు 10 రోజుల్లో విడుదల చేయనున్నారు.

Exit mobile version