AP Polycet 2023 : ఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్ 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ ని తాజాగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా మే 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఇటీవలే వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు..
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు గడువు – మే25 నుంచి జూన్ 1 వరకు
ధ్రువపత్రాల పరిశీలన – మే 29 నుంచి జూన్ 5 వరకు
వెబ్ ఆప్షన్లు – జూన్ ఒకటి నుంచి 6వ తేదీ వరకు
ఐచ్ఛికాల మార్పుకు జూన్ 7న అవకాశం కల్పిస్తారు.
సీట్ల కేటాయింపు జూన్ 9
అడ్మిషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత జూన్ 15 నుంచి అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు.
కాగా ఈ నెల 10వ తేదీన పాలిసెట్-2023 ను నిర్వహించిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన ఫలితాలు మే 20 న విడుదలయ్యాయి. ఈ పరీక్షకు మొత్తం 1,59,144 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా 1,43,625 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,24,021 మంది అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
అందుబాటులో ఉన్న డిప్లొమా కోర్సులు (AP Polycet 2023)..
సివిల్
మెకానికల్
ఆటోమొబైల్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్
ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్
కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
మెటలర్జికల్
కెమికల్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.