Site icon Prime9

APSLPRB: కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి

AP Police Constable

AP Police Constable

APSLPRB: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక పరీక్షా ఫలితాలు విడదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (APSLPRB) తాజాగా విడుదల చేసింది. పరీక్షా ఫలితాలను..
ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

ఫలితాల కోసం ఇలా చేయండి..

ఏపీలో Andhra Pradeshకానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఇందులో 95,208 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించినట్లు బోర్డ్ తెలిపింది.
ఈ ఫలితాలను.. ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఇందులో 95,208 మంది అభ్యర్తులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారికి.. త్వరోనే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

ఇవాల్టీ నుంచి ఈ నెల 7 వరకు.. అభ్యర్ధుల ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

(https://slprb.ap.gov.in/) లో ఓఎంఆర్‌ షీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

సందేహం ఉన్న అభ్యర్ధులు వీటిని చెక్ చేసుకోవాలని పోలీసు రిక్రూట్‌మెంట్‌  బోర్డు తెలిపింది.

ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను చెక్ చేసుకునేందుకు slprb.ap.gov.in లో లాగిన్ అయి.. వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

మెుత్తం ఎన్ని పోస్టులంటే

ఏపీ ప్రభుత్వం మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ ప్రాథమిక పరీక్షను.. జనవరి 22న నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో పకడ్బంధీగా పరీక్ష నిర్వహించారు.

పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ అధికారులు తెలిపారు.

అదే రోజు పరీక్షా కీ విడుదల చేసిన అధికారులు.. జనవరి 25 వరకు అభ్యంతరాలను స్వీకరించింది.

మెుత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహించారు. ఇందులో ఓసీలకు 40 శాతం.. బీసీలకు బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం కటాఫ్‌గా నిర్ణయించారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar