Ap Inter Supplementary Results : ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేడు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోజు (జూన్ 13, మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మూల్యాంకనం ప్రక్రియను పూర్తి చేశారు. మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షలు మార్చ్ నెలలో జరిగిన విషయం తెలిసిందే.
అనంతరం రికార్డు స్థాయిలో ఏప్రిల్ నెలలోనే ఫలితాలను విడుదల చేశారు. ఇక ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన వారి కోసం ఏడాది వృధా కాకుడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వెంటనే సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించి, వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేస్తోంది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.