Site icon Prime9

AP Inter: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు విడుదల

AP Inter

AP Inter

AP Inter: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల తేదీని విద్యాశాఖ విడుదల చేసింది. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు‌ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి. సప్లిమెంటరీ ఫీజు చెల్లించడానికి మే 3వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

కాగా ఏపీ ఇంటర్ ఫలితాలు బుధవారం( ఏప్రిల్ 26) విడుదల అయ్యాయి. 66.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండు సంవత్సరాలకు కలిపి 8,13,033 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 5,38,327 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

 

ఇంటర్ సెకండియర్ పరీక్షా తేదీల వివరాలు..(AP Inter)

మే 24న సెకండ్ లాంగ్వేజ్
25 న ఇంగ్లీష్
26 న మ్యాథ్స్‌-ఏ, బోటనీ, సివిక్స్
27న మ్యాథ్స్‌-బీ, జువాలజీ, హిస్టరీ
29 న ఫిజిక్స్, ఎకనామిక్స్
30న‌ కెమిస్ట్రీ, కామర్స్, సోషయాలిజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్, బైపీసీ విద్యార్ధులకు మ్యాథ్స్‌,లాజిక్ పేపర్
జూన్ 1న మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి.

 

 

Exit mobile version
Skip to toolbar