Site icon Prime9

Aginveer Result: అగ్నివీరుల నియామక పరీక్ష ఫలితాలు విడుదల

Aginveer Result

Aginveer Result

Aginveer Result: త్రివిద దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’స్కీమ్ లో భాగంగా నిర్వహించిన అగ్నివీరుల నియామక రాత పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ఫలితాలను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 17 నుంచి 26 వరకు విడతల వారీగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష సంబంధించి అధికారులు తాజాగా ఫలితాలు విడుదల చేశారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితా 

 

మెరిట్ ఆధారంగా తుది జాబితా(Aginveer Result)

రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అనంతరం శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. తర్వాత నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే పలు జోన్‌ల ఫలితాలు వెల్లడించిన అధికారులు.. ఆదివారం ఏఆర్‌వో చెన్నై జోన్‌ ఫలితాలు వెలువరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు తమ వివరాలను చెన్నై జోన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

 

Exit mobile version