Site icon Prime9

NTPC Recruitment 2022: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో 864 ఉద్యోగాలు

NTPC

NTPC

New Delhi: ప్రభుత్వరంగ సంస్ద నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ 864 ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌, మైనింగ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్‌-2022లో వ్యాలిడ్‌ ర్యాంక్‌ కూడా ఉండాలి.అలాగే అభ్యర్ధుల వయసు 27 యేళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ అనుసరించి వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.

ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. గేట్‌ 2022 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు ఎన్టీపీసీ వెబ్ సైట్ ను చూడవచ్చు.

Exit mobile version