Site icon Prime9

Bathukamma Immersion: బతుకమ్మను నిమజ్జనం ఎందుకు చేస్తారు.. దానివెనుకున్న రహస్యమేంటి..?

bathukamma immersion

bathukamma immersion

Bathukamma Immersion: పూలు బాగా వికసించి, జలవనరులు సమృద్ధిగా ఉండే సమయంలో వచ్చే పండుగ ఈ బతుకమ్మ. భూమి నీరు ప్రకృతితో మనుషులకు ఉండే అనుబంధాన్ని ఈ పండుగ గుర్తుచేస్తుంది. ఈ సంబరాల్లో భాగంగా రోజుకో బతుకమ్మని ఆరాధించి ఆఖరి రోజు అయిన 9రోజు సద్దుల బతుకమ్మని పూజించి నీటిలో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. మరి బతుకమ్మను ఎందుకు నిమజ్జనం చెయ్యాలి? దాని వెనుకున్న రహస్యమేంటి? బతుకమ్మ నిమజ్జనంతో వచ్చే లాభాలేంటో తెలుసుకుందామా..

అయితే బతుకమ్మను పేర్చేందుకు ఉపయోగించే పూలలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయట. 9 రోజుల పాటు 9 రకాల పూలను సేకరించి వాటిని అందంగా పేర్చుతారు. అనంతరం 9వరోజు సద్దుల బతుకమ్మను పూజించి ఆటపాలతో నిమజ్జనం చేస్తారు. ఇలా నిమజ్జనం చేయడం వల్ల ఆ పూలలో ఉండే ఔషధ గుణాలు నీటిని శుద్ధి చేస్తాయని విశ్వసిస్తారు.

ఇలా బతుకమ్మలో వినియోగించే పూలన్నింటిలో ఒక్కోదానిలో ఒక్కోరకమైన  ఔషధ గుణాలు ఉన్నాయి. వీటన్నింటినీ నిమజ్జనం చేయడం వల్ల చెరువుల్లో నీరు శుద్ధి అయి స్వచ్ఛమైన నీరు లభిస్తుంది, నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుందని కొందరి భావన.

ఇదీ చదవండి: Bathukamma: బతుకమ్మ పండగ ఎలా జరుపుకుంటారంటే..!

 

Exit mobile version