Durga Temple: దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ ఆలయ ఆదాయం రూ. 6.34 కోట్లు

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు భక్తులు దసరా సందర్భంగా రూ. 6.34కోట్లు ఆదాయాన్ని సేవల రూపంలో అందచేశారు. రికార్డు ఆదాయంగా అధికారులు పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా 12లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు భక్తులు దసరా సందర్భంగా రూ. 6.34కోట్లు ఆదాయాన్ని సేవల రూపంలో అందచేశారు. రికార్డు ఆదాయంగా అధికారులు పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా 12లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు.

ఆర్జిత సేవల, దర్శన టిక్కెట్లు, ప్రసాదాలు, తలనీలాలు కలిపి 10 రోజులకు గాను ఆదాయం వచ్చిన్నట్లు తెలిపారు. గత ఏడాది దసరాకు రూ. 4.08కోట్లు ఆదాయం వచ్చింది. లడ్డూ ప్రసాదాల ద్వార రూ. 2.48కోట్లు, దర్శన టిక్కెట్లు ద్వారా రూ 2.50కోట్లు, సేవల టిక్కెట్ల ద్వారా రూ 1.03కోట్లు, తలనీలాల ద్వారా రూ. 20 లక్షలు వచ్చాయి.

రేపటి నుండి మూడు రోజుల పాటు ఆలయ హుండీలను లెక్కించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శక్తి దేవాలయాల్లో ఒకటిగా దుర్గమ్మ తల్లి విరాజిల్లుతుంది.

ఇది కూడా చదవండి: అనంత పద్మనాభ స్వామి ఆలయ దివ్య మొసలి బబియా మృతి.. నివాళులర్పించిన భక్తులు