Site icon Prime9

Tirumala: తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు…ఏయే రోజులంటే ?

Break darshans canceled in Tirumala...on which days?

Break darshans canceled in Tirumala...on which days?

TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24,25, నవంబర్ 8 మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రకటించింది. దీపావళిని పురస్కరించుకొని 24న ఆస్థానం నిర్వహిస్తున్నామన్నారు. 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణాలుగా బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తితిదే తెలిపింది.

సూర్యగ్రహణం రోజున ఉదయం 8 నుండి రాత్రి 7.30 గంటల వరకు, చంద్రగ్రహణం రోజున ఉదయం 8.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారని తితిదే అధికారులు పేర్కొన్నారు. గ్రహణం రోజుల్లో అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసిన్నట్లు టిటిడి తెలిపింది. సర్వదర్శన భక్తులకు మాత్రమే స్వామి దర్శనానికి అనుమతించనున్నారు.

ఇది కూడా చదవండి:TTD: తితిదే కు ఎన్నారై భూరి విరాళం

Exit mobile version