Site icon Prime9

Guntur: పెళ్లికి నిరాకరించిందని బాలికపై కర్రలతో దాడి చేసిన యువకుడు

guntur crime latest news

guntur crime latest news

Guntur: పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు ఓ బాలిక మరియు ఆమె బంధువులపై విచక్షాణారహితంగా కర్రలు, రాళ్లతో బాలిక దాడిచేశాడు. ఈ ఘటనలో బాలిక సహా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన ఓ 16ఏళ్ల బాలికకు వివాహం నిశ్చయమైంది. అయితే, అదే గ్రామంలోని ప్రకాశం పంతులు వీధికి చెందిన మణికంఠ (23) అనే బాలుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని తరచూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇలా కాదని, మాట్లాడుకుని పరిష్కరించుకుందామని చెప్పి ఇరు కుటుంబాలు సమావేశమయ్యాయి. అయితే, బాలిక మాత్రం మణికంఠను వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకుంటానని మణికంఠను వివాహం చేసుకోనని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆపై మణికంఠ, అతడి బంధువులు బాలిక, ఆమె కుటుంబ సభ్యులపై కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో బాలిక సహా 11 మంది గాయపడ్డారు. వీరిలో 9 మందిని నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన బాలిక, ఆమె బంధువును గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: హోటల్ పై ఉగ్రవాదుల విధ్వసం.. ఆత్మాహుతి దాడిలో 9 మంది మృతి

Exit mobile version