Site icon Prime9

Hyderabad Kidnap : పట్టపగలు బెడ్‌రూమ్ నుంచి యువతి కిడ్నాప్.. సుమారు 100 మంది వచ్చి… కొట్టి ఎత్తుకెళ్లిన వైనం !

young-girl-kidnap-in-hyderabad

young-girl-kidnap-in-hyderabad

Hyderabad Kidnap : హైదరాబాద్ మహనగరంలో రౌడీయిజం రోజురోజుకీ పెరిగిపోతుంది. నగరం నడిబొడ్డున సుమారు 100 మంది రౌడీ మూకలతో పట్టపగలు ఓ యువతిని కిడ్నాప్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. నగరంలోని తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి మన్నేగూడ  లోని సిరి టౌన్ షిప్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో యువతి నివసిస్తున్న ఇల్లు పూర్తిగా ధ్వంసం చేశారు. ఆపై అడ్డుకోబోయిన యువతి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారిపైన దాడి చేశారు. ఈ దాడిలో వారు గాయపడినట్లు తెలుస్తుంది.

ఈ కిడ్నాప్ ఉదంతం వెనుక ఉన్నది మిస్టర్ టి ఓనర్ నవీన్ రెడ్డి గా స్పష్టమవుతుంది. కిడ్నాప్ కి గురైన యువతి ముచ్చర్ల దామోదర్ రెడ్డి, నిర్మల ల కూతురు ” ముచర్ల వైశాలి “. కాగా 24 ఏళ్ల వయసున్న ఈమె ప్రస్తుతం డెంటల్ డాక్టర్ గా చేస్తుంది. ఈ దారుణ ఘటనతో ఇబ్రహీంపట్నం ఏసిపి ఉమామహేశ్వరరావు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.

ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే వందమంది కలిసి వచ్చి యువతి ఇంటిపై ఎందుకు ఎటాక్‌ చేశారు ? యువతి వైశాలిని మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్లారు ? అనే ప్రశ్నలు సస్పెన్స్‌గా మారాయి. ఈ ఘటనలో ఇంట్లో సిసీ కెమెరాలు పరిశీలించగా నవీన్‌ సుమారు 100 మందితో యువతి ఇంటికి వెళ్లాడు. అప్పటికే వాళ్ల చేతుల్లో కర్రలు, రాడ్లు ఉన్నాయి. అనంతరం ఇంట్లోని సామగ్రిని అంతటిని ధ్వంసం చేశారు. అలానే ఇంటి ముందు ఉన్న కారును సైతం ధ్వంసం చేశారు. ఇక ఇంటి లోపలి నుంచి ఒక వ్యక్తిని బయటకి లాక్కొని వచ్చి మూకుమ్మడి దాడి చేశారు. కిందపడేసి కర్రలతో విపరీతంగా కొట్టారు.

గతం లోనే నవీన్ రెడ్డి పై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. తమ కూతుర్ని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని కోరుతున్నారు. ఇంటిపై దాడికి పాల్పడుతున్న సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం బయటికొచ్చింది.

Exit mobile version