Kanpur: కాన్పూర్‌లో ఒక మహిళ తన స్నేహితురాలితో సెక్స్ లో పాల్గొనడానికి నిరాకరించడంతో బాయ్ ప్రెండ్ ప్రైవేట్ భాగాలను కోసేసింది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కాన్పూర్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ సంజయ్ పాండే తెలిపారు.ఈ సంఘటన చౌబేపూర్ పోలీస్ సర్కిల్‌లోని ఒక గ్రామంలో జరిగింది.
సెక్స్ కు నిరాకరించడంతో..( Kanpur)
సదరు గ్రామానికి చెందిన వ్యక్తి వివాహిత మహిళతో సంబంధం కలిగి ఉన్నాడు.సోమవారం రాత్రి, ఆ మహిళ తన స్నేహితుల్లో ఒకరిని కలవాలని అతన్ని ఆహ్వానించింది. అతను అక్కడికి వెళ్లిన తరువాత తనతో శృంగారంలో పాల్గొనాలని మహిళ స్నేహితురాలు ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అతను నిరాకరించడంతో మహిళ అతని ప్రైవేట్ భాగాలను కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో యువకుడు ఇంటికి చేరుకున్నాడు. అతని కుటుంబ సభ్యులు అతన్ని చౌబేపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్చారు, అక్కడ నుండి మెరుగైన చికిత్సకు కాన్పూర్ కు రిఫర్ చేశారు. కేసు నమోదు ప్రక్రియలో ఉందని, అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.