Site icon Prime9

Hyderabad Cable Bridge: చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన యువతి

Woman attempted suicide

Woman attempted suicide

Hyderabad: చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పొడిన ఘటన కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు వద్ద చోటుచేసుకొనింది. మానసిక వత్తిడి కారణంగా యువతి చెరువులోకి దూకిన్నట్లు ప్రాధామిక సాక్ష్యాలతో పోలీసులు గుర్తించారు. సమాచారం మేరకు, స్వప్న అనే యువతి నేటి సాయంత్రం హఠాత్తుగా చెరువులోకి దూకింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకొన్న డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. యువతి ఆచూకీ కోసం శ్రమిస్తున్నారు.

చెరువలో దూకేముందు స్వప్న తన వద్ద వున్న బ్యాగు, పాదరక్షలు బ్రిడ్జ్ పైభాగంలో వదిలి చెరువలో దూకింది. అందులో లభించిన అడ్రస్సుకు పోలీసులు సమాచారం అందించారు. కొంతకాలంగా మానసిక వత్తిడిలో ఉన్నట్లు, వైద్యుల వద్ద పరిక్షలు కూడా చేయించుకొన్నట్లు పర్సులో దొరికిన కామినేని ఆసుపత్రి డాక్టర్ ప్రిస్రిప్షన్ తో పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకొన్న కుటుంబసభ్యులు, స్వప్న మానసికంగా బాధపడుతోందని తెలిపారు. ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత, తను ఇంటికి రాలేదని పేర్కొన్నారు.

గతంలో స్వప్నకు వివాహం జరిగి, విడాకుల కూడా తీసుకోవడంతో ఒంటరితనంతో మానసికంగా కుంగిపోయిన్నట్లు తెలుస్తుంది. ఆత్మహత్య చేసుకొనేందుకు ఎల్బీ నగర్ నుండి ప్రత్యేకంగా కేబుల్ బ్రిడ్జ్ వద్దకు వచ్చిన్నట్లు పోలీసులు గుర్తించారు.

 

ఇది కూడా చదవండి: డీజీపీ రావాలని హైకోర్టు ఆదేశం

Exit mobile version