Site icon Prime9

Murder Case : వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. ప్రశ్నించినందుకు భర్తను దారుణంగా హత్య

wife killed husband for illegal relationship

wife killed husband for illegal relationship

Murder Case : వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. ప్రశ్నించినందుకు.. భర్తను అత్యంత దారుణంగా కడతేర్చింది. ఈ దారుణ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన అడ్డూరి విజయలక్ష్మి భర్త ముద్దాయి దేముడు కొత్త వలసలో ఓ గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడు. దేముడికి విజయలక్ష్మితో 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. కొంతకాలంగా భార్య విజయలక్ష్మి ప్రవర్తన మీద భర్తకు అనుమానం వచ్చింది. భార్య వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధంపెట్టుకుందని అనుమానించిన భర్త తరచుగా ఆమెతో గొడవలు పడుతుండేవాడు.

ఈ అనుమానానికి తోడు విజయలక్ష్మి కూడా ఇంట్లో చెప్పా పెట్టకుండా.. ఉదయం బయటికి వెళ్లి సాయంత్రానికి వస్తుండేది. భార్యను ఈ విషయంలో దేముడు అనేకసార్లు నిలదీశాడు. దీంతో విసిగిపోయిన విజయలక్ష్మి భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుంది. 2019 సెప్టెంబర్ 2వ తేదీన రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత అతని పొట్టపై కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో దేముడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స తీసుకుంటూ తెల్లవారి మృతి చెందాడు. దేముడు సమీప బంధువైన మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తవలస ఎస్సై బి మురళి అప్పుడు కేసు నమోదు చేశాడు. నిందితురాలైన భార్య విజయలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

ఇక విజయలక్ష్మి మీద మోపిన అభియోగాలు రుజువు కావడంతో న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. అలానే జీవిత ఖైదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. తండ్రి మృతి తల్లి జైలుకు వెళ్లడంతో అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలకు ప్రభుత్వం చెరో మూడు లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

Exit mobile version