Prime9

కోనసీమ జిల్లా : కోనసీమలో ’ఉప్పెన‘ తరహా ఘటన.. అయితే తేడా ఏమిటంటే..

Konaseema District : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. గూడపల్లి గ్రామానికి చెందిన కటికిరెడ్డి కృష్ణ గణేష్ తాటిపాకకు చెందిన వివాహితకు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం భర్త బయటకు వెళ్లాడని చెప్పిన మహిళ.. ప్రియుడిని ఇంటికి రమ్మని పిలిచింది. అయితే ఇంటికి వచ్చిన కృష్ణతో మహిళ వాగ్వాదానికి దిగింది.

కృష్ణ మరికొందరు మహిళలతో కూడా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడనే అనుమానంతో అతడితో గొడవకు దిగింది. వేరే మహిళలతో సంబంధాలు ఉన్నాయా అని నిలదీసింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. దీనితో ఆగ్రహానికి గురైన ఆ వివాహిత.. ఈ క్రమంలోనే బ్లేడ్‌తో కృష్ణ మర్మాంగంపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన కృష్ణ బయటకు పరుగులు తీశాడు. అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి కృష్ణ ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version
Skip to toolbar