UP Atrocious: యూపీలో ఒక యువకుడు తన సోదరి వేరొక వ్యక్తిని ప్రేమించిందన్న కారణంగా ఆమె తలను నరికి దానితో పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఘటన సంచలనం కలిగించింది. . ఫతేపూర్ ప్రాంతంలోని మిత్వారా గ్రామంలో 22 ఏళ్ల రియాజ్ మరియు అతని 18 ఏళ్ల సోదరి ఆషిఫా మధ్య వాగ్వాదం నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.
ప్రేమికుడితో పరారు..( UP Atrocious)
రియాజ్ తన సోదరి మెడను పదునైన ఆయుధంతో కోశాడని, ఆమె తలతో పోలీస్ స్టేషన్‌కు వెళుతుండగా, పోలీసులు అతడిని అరెస్టు చేశారని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశుతోష్ మిశ్రా తెలిపారు. ఆషిఫా ఇటీవల అదే గ్రామానికి చెందిన తన భాగస్వామి చాంద్ బాబుతో కలిసి పారిపోయిందని మిశ్రా తెలిపారు.అయితే, మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కొన్ని రోజుల తర్వాత ఆషిఫాను వెతికిపట్టుకుని బాబును జైలుకు పంపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రియాజ్ తన సోదరి సంబంధాన్ని వ్యతిరేకించేవాడని, ఈ విషయమై ఇద్దరూ తరచూ గొడవ పడుతుండేవారని పోలీసులు తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం అవసరమైన ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.