Gadwal Accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. ఈ ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో మృతుల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గద్వాల- రాయచూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ముగ్గురు మృతి..
గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. ఈ ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో మృతుల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గద్వాల- రాయచూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గోనుపాడు సమీపంలో.. వేగంగా వచ్చిన ఓ బొలేరో వాహనం బలంగా ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆటోలో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి.. మార్చురీకి తరలించారు. మృతులు గద్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని దౌదర్ పల్లి వాసులుగా గుర్తించారు.
మృతిచెందిన ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు పాతబట్టలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు గద్వాల నుంచి రాయచూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం అనంతరం బొలెరో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన అర్జున్, వైశాలికి మూడు నెలల క్రితమే వివాహం జరిగింది.