Site icon Prime9

Theft in Hyderabad: హైదరబాదు స్టార్ హోటల్ లో ఛోరీ…ఆలస్యంగా వెలుగులోకి

Theft in Star Hotel Hyderabad... came to light late 

Theft in Star Hotel Hyderabad... came to light late 

Star Hotel: స్టార్ హోటళ్లు అంటేనే ఖరీదైన వ్యక్తులు, కంపెనీల్లో పనిచేసే ఉన్నతస్థాయి సిబ్బంది ఇలాంటి వారే బస చేస్తుంటారు. వీరి కోసం సకల సౌకర్యాలను ఆయా యాజమాన్యాలు కల్పిస్తుంటాయి. షూట్స్ గా పేర్కొనే రూముల్లో బస చేసే వ్యక్తుల వస్తువుల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకొంటారు. అందుకే ఖరీదైన వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా స్టార్ హోటల్స్ ను ఎంచుకొంటుంటారు. కాని వాటి భధ్రతపై కూడా అనుమానం చెలరేగేలా హైదరబాదు పార్క్ హయత్ స్టార్ హోటల్ లో ఓ ఘటన చోటుచేసుకొనింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదై ఉండడం కూడా గమనార్హం.

సమాచారం మేరకు, సెప్టెంబర్ 22న ముంబైకి చెందిన అహ్మద్ బేగ్ అనే వ్యక్తి బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ లో బస చేశాడు. హోటల్ లో వీఐపి రాక మూలంగా సెప్టెంబర్ 24న సోమాజిగూడలోని పార్క్ హోటల్ కు అహ్మద్ బేగ్ మారారు. అయితే తన వద్ద ఉన్న బంగారు ఆభరాణాలు కనపడడం లేదని బేగ్ 25న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 10.36 గ్రాముల డైమండ్ బ్రాస్లెట్, 35 డైమండ్స్, 3.61 గ్రాముల 89 డైమండ్ పొదిగిన రింగ్, 5.18 గ్రాముల మంగళ సూత్రం, గోల్డ్ చైన్, చెవి దిద్దులు, అపహరణకు గురైన్నట్లు ఫిర్యాదులో అహ్మద్ బేగ్ పేర్కొన్నాడు.

ఈమేరకు రంగంలోకి దిగిన క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రెండు హోటళ్లు మారిన క్రమంలో ఎక్కడ పొరపాటు జరిగింది అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పాటు అంత విలువైన వస్తువులను ఎందుకు తెచ్చుకొన్నారు, ఏదైనా శుభకార్యమా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

కొన్ని కీలకమైన కేసులు కూడా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పోలీసు స్టేషన్లో నమోదైయ్యే కేసుల వివరాలను ఎప్పటికప్పుడు తెలిసేలా పోలీసు అధికారిక వెబ్ సైట్ లో నమోదు చేస్తే కొన్ని వాస్తవ విషయాలు వెంటనే బయట పడేందుకు వీలుంటుంది.

ఇది కూడా చదవండి:Jammu Kashmir: డీజీపీ దారుణ హత్య.. గొంతు కోసి ఆపై కాల్చి..!

Exit mobile version